నవతెలంగాణ – అశ్వారావుపేట
ఉద్యాన శాఖ నిర్దేశించిన ఆయిల్ ఫాం సాగు విస్తరణ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ కు ఆయిల్ ఫెడ్ అడ్వైజరీ కమిటి సభ్యులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ సూచించారు. సాగుపై ఆశక్తి చూపే రైతులందరికీ మొక్కలు పంపిణీ తో పాటు రాయితీ పథకాలు అందించాలని చెప్పారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ ఫెడ్ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయిల్ ఫాం రైతు సమస్యలపై అధికారులతో చర్చించారు. కనీస మద్దతు ధర టన్నుకు రూ.15 వేలు తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సృష్టం చేశారు. ఆయిల్పాం గెలలు దిగుబడుల తగ్గుదల పై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల గెలల దిగుబడి తగ్గుతుందని, తోటల నిర్వాహణలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన దిగుబడి సాధించవచ్చని అధికారులు తెలిపారు. ఆయిల్పాం రైతులు ఎదుర్కోంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి సాగుకు తోడ్పాటు గా ఉండాలని కోరారు. కొత్తగా ఆయిల్ ఫాం సాగు చేసే రైతులకు కనీస అవగాహన కూడా కల్పించాలని, క్షేత్ర సిబ్బందిని రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ రాధాక్రిష్ణ లు ఉన్నారు.