– ప్రజాప్రతినిధుల మాటలపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణ
– మండల కేంద్రంలోని అసంపూర్తి పనులను సందర్శించిన శ్రేణులు
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలినపోయిన పలు అభివృద్ధి పనులను పూర్తి చేయకుండా అభివృద్ది చేశామంటూ మండల ప్రజలను మభ్యపెడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కాలం వెల్లదీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి ఆరోపించారు.అదివారం మండల కేంద్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన పలు అభివృద్ధి పనులను మండల కాంగ్రెస్ శ్రేణులు సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా రత్నాకర్ రెడ్డి మాట్లాడారు.మండల కేంద్రంలోని ఊర చెరువు మిని ట్యాంక్ బండ్ సుందరీకరణ,మిని స్టేడియం నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రారంభించి గత కొద్ది నేలలుగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నయన్నారు.ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ రావు నిధులు విడుదల చేసిన పనులు చేపట్టడంలో అలసత్వం వహించడంలో అంతర్యమేమిటో వెల్లడించాలని.. లేనిపక్షంలో అసంపూర్తి పనులను వేంటనే పూర్తి చేయాలని సూచించారు. నాయకులు శానగొండ శ్రావణ్,బోనగిరి రాజేందర్,రొడ్డ మల్లేశం,మైల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.