జీవితం మీద విరక్తి చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య 

నవతెలంగాణ-కుబీర్ : మండల కేంద్రానికి చెందిన బత్తిని గంగారం 72 అనే వృద్ధుడు శక్రవారం ఇంట్లో ఎవరు లేనిది చూసి చున్నీ తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాల ప్రకారం గంగారం అనే వృద్ధుడు గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడితున్న క్రమంలో ఎన్నో అస్పత్రి లో చికిత్స చేసుకున్న ఆరోగ్యం  బాగా కాకపోవడంతో దీని క్రమంలో మద్యం సేవించే వాడు దింతో శుక్రవారం ఉదయం సమయంలో కొడుకు వ్యవసాయ పనుల కొరకు చేనిలోకి వెళ్లారు ఇంట్లో గంగారం మరియు కోడలు సుజాత ఇద్దరు ఇంట్లో ఉండగ ఇంటి ప్రక్కన ఉన్న రేకుల షెడ్డులో చున్నీతో ఉరి వేసుకోవడంతో కోడలు సుజాత సాయంత్రం సమయంలో మామ కనిపిస్తలేదు అని చుట్టు పక్కల వెతకగా రేకుల షెడ్డులో ఉరి వేసుకోవడం చూసి వెంటనే కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చి చూసే సరికి ఉరి వేసుకున్న వ్యక్తికి వెంటనే అస్పత్రి తీసుకువెళ్లగా మార్గ మధ్యలో మృతి చెందడం జరిగిందని కొడుకు బత్తిని దిగంబర్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ రవీందర్ తెలిపారు.