రెడ్మీ బ్రాండ్‌ అంబాసీడర్‌గా దిశా పటాని

న్యూఢిల్లీ : షావోమి ఇండియాకు చెందిన రెడ్మీ ఆడియో, పరికరాలకు బాలీవుడ్‌ స్టార్‌ దిశా పటాని ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. త్వరలో ఆవిష్కరించనున్న రెడ్మీ బడ్స్‌4 ఆక్టివ్‌కు తొలి క్యాంపెయిన్‌ నిర్వహించనున్నారు. తమ బ్రాండ్‌ ఉత్పత్తులకు పాటాని ప్రచారంతో మరింత గుర్తింపు రానుందని షావోమి ఇండియా చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అనుజ్‌ శర్మ తెలిపారు.