– నీరు నిలిచి కుంటలను తలపిస్తున్న రహదారులు
– చెత్త, మురుగుతో నిండిపోయిన కాలువలు
– స్పందించని ఆధికారులు
– దోమలు వ్యాప్తి చెంది రోగాలు ప్రబలే ప్రమాదం
నవతెలంగాణ-పెద్దేముల్
ప్రత్యేక అధికారుల పాలనలో పల్లెలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన అధికారులకు వారి శాఖల పనులు చేసేసరికి సమయం సరిపోతుంది. దీం తో పంచాయతీ పాలనపై దృష్టి సాధించడం లేదని వారు అంటున్నారు. పంచాయతీలో ముందస్తుగా పరిశుభ్రతపై దృష్టి సాధించలేక పోతే దోమలు వ్యాప్తి చెంది రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇ ప్పటికే కురుస్తున్న వర్షాలకు పల్లెల్లోని ప్రధాన రహ దారులు, కాలనీలో నీరు నిలిచి కుంటలను తలపిస్తున్నా యి. ముందస్తుగా మురుగు కాలువల శుభ్రం చేయక పోవడంతో దోమల వ్యాపి పెరుగుతుంది. పంచాయతీల కు ఏటా జూన్‌లోనే బ్లీచింగ్ పౌడర్ సంచులు పంపించే స్తారు. వర్షాలు కురుస్తున్న వెంటనే మురుగు కాలువలు శుభ్రం చేయించి బ్లీచింగ్ చెల్లించేవారు. ఈ ఏడాది జులై నెల ముగిస్తున్న నేటికీ కొన్ని గ్రామాలలో పంపిణీ కాలేదని కార్యదర్శులు చెబుతున్నారు. గ్రామాలలోని ము రుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో కాలువలు చెత్త, మురుగుతో నిండిపోయాయి, ఇదివరకు పంచాయ తీలో అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇప్ప టికైనా అధికారులు స్పందించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.