– నిజం సాగర్ మండలానికి పర్మినెంట్ ఎంఈఓ ఎప్పుడో
– మూడు మండలాలకు ఒకరే ఇన్చార్జ్ ఎంఈఓ
– పర్యవేక్షణ కరువైన నిజాంసాగర్ మండలంలో అస్తవ్యస్తంగా తయారవుతున్న విద్య వ్యవస్థ
– సరిగ్గా విధులు నిర్వహించని ఉపాధ్యాయులు
– ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడు మూడు పాఠశాలలకు ఇంచార్జ్
– పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఫోన్లు మాట్లాడుకుంటూ బయట తిరగడం
నవ తెలంగాణ-నిజంసాగార్
నిజం సాగర్ మండలంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది దీనికి ప్రధాన కారణం పర్మినెంట్ ఎంఈఓ లేకపోవడమే. నిజం సార్ మండల వ్యాప్తంగా మొత్తం 26 గ్రామాలు ఉన్నాయి దీనిలో 5వ తరగతి నుండి పదవ తరగతి వరకు 9 పాఠశాలలు ఉన్నాయి. ఒకటి నుండి 5వ తరగతి వరకు 39 పాఠశాలలు ఉన్నాయి. అయితే మండలానికి పూర్తిస్థాయి ఎమివో లేకపోవడం వల్ల పాటశాల పర్యవేక్షణ కరువైపోతుంది. ఇంచార్జ్ ఎంఈఓ పిట్లం పెద్ద కొడపగల్ నిజం సాగర్ మండలాలకి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు మరియు చిల్లర్గి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కూడా విధులు నిర్వహిస్తున్నాడు. దీనివల్ల పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు టైం కు రాకపోవడం మరియు సరిగా విద్యను బోధించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి మరియు మధ్యాహ్న భోజనం కూడా నాణ్యమైన భోజనం వండడం లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి 2018 నుండి కూడా ఇన్చార్జ్ ఎంఈఓ తోటే నెట్టుకు రావడం గమానరహం ఇదిలా ఉండగా కొందరి ప్రధానోపాధ్యాయులకు రెండు లేదా మూడు పాఠశాలలకు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దీనివల్ల పాఠశాలలో ఉండే ప్రధానోపాధ్యాయుడు మూడు పాఠశాలలకు తిరగడం వల్ల ఏ ఒక్క పాఠశాల మీద కూడా సరిగ్గా పర్యవేక్షణ చేయలేకపోతున్నారని కొందరు ప్రధానోపాధ్యాయులు తెలిపారు దీని ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే పరిస్థితులు తలెత్తుతాయని కొందరు ఆరోపిస్తున్నారు కొన్ని పాఠశాలలో మాత్రం పాఠశాలను త్వరగా మూయడం జరుగుతుంది అని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటివరకు ఏ ఒక్క పాఠశాలకు ఎంఈఓ గానీ డీఈఓ గానీ జిల్లాస్థాయి సిబ్బంది గానీ పర్యవేక్షించకపోవడం గమనారం.