– వైరా పట్టణ ప్రముఖులు చింతనిప్పు వెంకటయ్య
– విద్యా, వైద్య రంగాల్లో సమూల మార్పులు అవసరం
– బోడేపూడి కళానిలయం సంస్థ కార్యదర్శి బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరాటౌన్
బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో 108 నెలల నుంచి క్రమం తప్పని వైద్య సేవలు అందించడం చారిత్రాత్మకమైన కృషి అని వైరా ప్రముఖులు చింతనిప్పు వెంకటయ్య అన్నారు. ప్రతి నెల మూడవ ఆదివారం వైరాలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బోడేపూడి కళానిలయం వైద్య శిబిరం గత 108 నెలల నుంచి క్రమం తప్పకుండా నిరంతరంగా నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం ఖమ్మం ప్రముఖ వైద్యులు చీకటి భారవి, పిల్లలమర్రి సుబ్బారావు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా వైరా ప్రముఖులు చింతనిప్పు (నాగార్జున) వెంకటయ్య, బోడేపూడి కళానిలయం సంస్థ కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ ఆధునిక యుగంలో ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురి అవుతున్నారని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆహార అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. డాక్టర్ల బృందం క్రమం తప్పకుండా వైద్య శిబిరానికి హాజరు కావడం వల్ల బోడేపూడి వైద్య శిబిరంలో రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు సేవలు పొందటం జరుగుతుందన్నారు. విద్య, వైద్య రంగాల్లో సమూల మార్పులు రావాలని అన్నారు. వైద్యం భరించలేని ఖరీదు కావడంతో ప్రజలు సకాలంలో వైద్యం పోందలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో పాపినేని రమేష్, సుంకర సుధాకర్, తోట నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ బొంతు సమత, గుడిమెట్ల రజిత, మాదినేని రజినీ, గుడిమెట్ల మోహన్‌రావు, అనుమోలు రామారావు, పాసంగులపాటి చలపతిరావు, కంభంపాటి సత్యనారాయణ, అయిలూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.