నవతెలంగాణ – ( వేల్పూర్ ) ఆర్మూర్
తెలంగాణ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా మంగళవారం మండలము లోని పి ఎ సి ఎస్ మోతే, వేల్పూరు పడగల్ పరిధిలో సబ్సిడీ పైన జిలుగ విత్తనాలు రైతులకి అందించడం జరిగినది అని వ్యవసాయ అధికారి నర్సయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.30 కిలోల సంచి పూర్తి ధర రూ.2790/- వుండగా 60% సబ్సిడీ పోను రైతులు రూ.1116/- రూపాయల చెలించి తీసుకోవాలని, 30 కిలోల సంచి రైతులు రెండున్నర నుండి మూడు ఏకరాలకి వాడుకోవాల నీ పచ్చి రొట్ట ఎరువులు వాడటం వల్ల నెలలో సేంద్రీయ కార్బనం పెరుగును, చౌడు నెలలో పచ్చి రొట్ట వల్ల చౌడు ప్రభావం తగ్గును. రసాయన ఎరువుల వాడకం 15-20 శాతం తక్కువ వాడవచ్చ అని తెలిపారు. పొలం లో విత్తనాలు చల్లిన 25-30 రోజులలో మొక్క పెరిగి పుత దశ కి వస్తుంది. ఆ సమయంలో మొక్కలను రోటవేటర్ తో పొలంలో కలియ దున్నాలి. జిలుగు పూర్తిగా కుళ్ళ దానికి 100 కేజీ ల సూపర్ ఒక ఏకరకి చల్లుకోవాలి. జిలుగు వల్ల 2 % నత్రజని మొక్కలకి అదనంగా లభిస్తుంది. జింక్, మాంగనీస్, ఇనుము వంట్టి సూక్ష్మ పోషకాలు అందుతాయి. అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ సీఈఓ లు రాజేష్, కృష్ణ ,మోహన్, ఏ ఈ ఓ షబ్బీర్ రైతులు పాల్గొన్నారు..