
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ కిషన్, తహశీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓటర్ లిస్ట్ ప్రదర్శన నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు 40 గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఓటర్ లిస్ట్ ప్రదర్శించి నోటీస్ బోర్డులో ప్రజలకు అందుబాటులో పెట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఈ 21 తేదీ వరకు ఆయా గ్రామ పంచాయతీలలో ఓటర్ జాబితాల ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. వారం రోజుల సమయంలో గ్రామస్తులు గ్రామపంచాయతీకి వచ్చి ఓటర్ జాబితాలో తప్పులు సరి చేసుకోవడానికి, అభ్యంతరాలను స్వీకరించడానికి చివరి అవకాశం అని తెలిపారు. తదుపరి పూర్తిస్థాయి ఓటర్ జాబితాను తయారు చేయడం జరుగుతుందని తర్వాత ఎలాంటి అభ్యంతరాలు ఉన్న స్వికరించడం జరగదని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ ప్రకాష్, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.