– మున్సిపల్ శాఖ, వైద్యశాఖ నిర్లక్ష్యం..
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణం కిసాన్ నగర్ జనావాసాల మధ్యనే బయో మెడికల్ వ్యర్ధాలను గుర్తు తెలియని వ్యక్తులు పారవేశారు. ఆ యొక్క బయో మెడికల్ వ్యర్ధాలలో పాత ఓంకార్ టాకీస్ ప్రక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ యొక్క ప్రెస్క్రిప్షన్ లెటర్లు ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున జనవాసాల మధ్యన బయో మెడికల్ వ్యర్ధాలు పారవేయడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. యొక్క బయో మెడికల్ వ్యర్ధాలు మున్సిపల్ సిబ్బంది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ హాస్పిటల్ నుండి తీసుకువచ్చి పారవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. బయో మెడికల్ వ్యర్థాలను తొలగించడానికి ప్రత్యేకమైన సంబంధిత ఇండస్ట్రీస్ వారికి అప్పగించే ఒప్పందం చేసుకున్న తర్వాతనే వైద్యశాలలకు అనుమతిస్తారు. ఈ ప్రైవేటు హాస్పటల్ ఒప్పందం చేసుకున్న తర్వాత అనుమతి ఇచ్చారా లేక ఒప్పందం కాలపరిమితి ముగిసిందా అనే అనుమానాలు ఉన్నాయి. బయో మెడికల్ వ్యర్ధాలతో అనారోగ్యాలు బయో మెడికల్ వ్యర్ధాలతో ప్రజలు తీవ్రమైన అనారోగ్య పాలవుతారు. జనవాసాల మధ్య పారవేయడం ప్రభుత్వ చట్టాల ప్రకారం నేరం. శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ పై ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వారు హాస్పటల్ వద్దకు వెళ్లి ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా హాస్పటల్లో నిర్వహిస్తున్నారని నిరసన తెలిపి జిల్లా వైద్య అధికారులకు హాస్పటల్ పై ఫిర్యాదు చేశారు. జిల్లా వైద్యాధికారులతో లోపాయకరంగా అవగాహన కుదుర్చుకొని అనుమతులు ఉండేటట్లు చేసుకున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తులకు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించినట్లు సమాచారం. ప్రజలకు అనారోగ్యం కలిగించే విధంగా చెత్తాచెదారాన్ని బయో మెడికల్ వ్యర్ధాలను ఆ ప్రైవేట్ హాస్పటల్ వారే నిర్లక్ష్యంగా మున్సిపల్ సిబ్బందికి లేక ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి ఇండ్ల మధ్యనే వేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
బయో మెడికల్ వ్యర్ధాలు
బయోమెడికల్ వ్యర్థాలు ఘన లేదా ద్రవంగా ఉండవచ్చు. విస్మరించబడిన రక్తం , షార్ప్‌లు, అవాంఛిత మైక్రోబయోలాజికల్ కల్చర్‌లు మరియు స్టాక్‌లు, గుర్తించదగిన శరీర భాగాలు ( విచ్ఛేదనం ఫలితంగా ఉన్న వాటితో సహా ), ఇతర మానవ లేదా జంతువుల కణజాలం, ఉపయోగించిన పట్టీలు మరియు డ్రెస్సింగ్‌లు, విస్మరించిన చేతి తొడుగులు, ఇతర వైద్య సామాగ్రి వంటివి అంటు వ్యర్థాలకు ఉదాహరణలు. రక్తం మరియు శరీర ద్రవాలతో సంబంధంలో , మరియు పైన వివరించిన లక్షణాలను ప్రదర్శించే ప్రయోగశాల వ్యర్థాలు. వేస్ట్ షార్ప్‌లలో కలుషితమైన (మరియు ఉపయోగించని విస్మరించబడిన) సూదులు, స్కాల్‌పెల్స్ , లాన్‌సెట్‌లు మరియు చర్మంలోకి చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న ఇతర పరికరాలు ఉంటాయి. బయోమెడికల్ వ్యర్థాలు జీవసంబంధ మరియు వైద్య వనరులు మరియు వ్యాధుల నిర్ధారణ, నివారణ లేదా చికిత్స వంటి కార్యకలాపాల నుండి ఉత్పన్నమవుతాయి. బయోమెడికల్ వ్యర్థాల యొక్క సాధారణ జనరేటర్లు (లేదా ఉత్పత్తిదారులు) ఆసుపత్రులు, ఆరోగ్య క్లినిక్‌లు , నర్సింగ్ హోమ్‌లు, ఇతరములు ఉన్నాయి. బయోమెడికల్ వ్యర్థాల వల్ల జీవ రసాయన ప్రమాదాలు ఎదుర్కునే అవకాశం ఉంది గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు ప్రజలకు అంటుకునే అవకాశం ఉంది. కిసాన్ నగర్ లో పడవేసిన వ్యర్ధాలలో ఇంజక్షన్లు , నిడిల్సు గ్లూకోజ్ ఐ వి సెట్స్, రక్తంతో కూడిన దూది, వాడి పడేసిన కాటన్, మందుల కాలి సీసాలు, మందుల డబ్బాలు, వెంకటేశ్వర హాస్పటల్ ప్రిస్క్రిప్షన్, బ్లడ్ టెస్ట్ రిపోర్టులు, ల్యాబ్ మెడికల్ బిల్లులు ఉన్నాయి. బయో మెడికల్ వేస్టేజ్ తీసుకపోయే కంపెనీలతో ఒప్పందం చేసుకున్న తర్వాతనే వైద్యశాలకు పర్మిషన్ వస్తుంది. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో రోమా ఇండస్ట్రీస్ కంపెనీతో పలు వైద్యశాలలు ఒప్పందం చేసుకున్నాయి. వీరు ఒప్పందం చేసుకున్నారు లేక ఒప్పందం కాల పరిమితి అయిపోయిందో అనే అనుమానాలు ఉన్నాయి. ఊరంతా ఒక దారయితే ఉలిపిరి కట్టది మరోదారి అన్నట్లు వర్షాకాలంలో పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో స్వచ్ఛభారత్ పెద్ద ఎత్తున జరుగుతుంటే ఆ సమయంలో ఇలాంటి ప్రమాదకరమైన వ్యర్ధాలను ఇండ్ల మధ్యనే వేయించడం అ వైద్యశాలకే చెల్లింది. అడుగడుగున వైద్యశాల నిర్లక్ష్యం కనబడుతుంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఈ వైద్యశాలను జిల్లా వైద్య అధికారులు వెంటనే సీజ్ చేయాలి.
వ్యర్ధాలను ఎత్తివేసిన మున్సిపల్
భువనగిరి పట్టణం కిసాన్ నగర్ మాజీ కౌన్సిలర్ ఇంటి పక్కన ఆస్పటల్ సంబంధించిన బయో మెడికల్ వ్యర్ధాలను పారవేసిరని మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు అందడంతో అక్కడికి వెళ్లి హుటాహుటిన తీసివేయించారు. విచారణ జరిపి నోటీసులు అందిస్తాం. సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్. హాస్పిటల్స్ వారు బయో మెడికల్ వ్యర్ధాలను పారవేయడం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో విచారణ జరిపి సంబంధిత హాస్పటల్ నోటీసులు అందజేస్తామని తెలిపారు.
విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
జనవాసాల మధ్య నిర్లక్ష్యంగా బయో మెడికల్ వ్యర్ధాలను పారవేసిన హాస్పటల్ పై జిల్లా వైద్యశాఖ, మున్సిపల్ శాఖ విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకొని హాస్పిటల్ సీజ్ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకరమైన వ్యర్ధాలను ప్రజల ఆరోగ్యాలను నాశనం చేసే ఇలాంటి వ్యర్థాలను హాస్పటల్ యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజల ఆరోగ్యతో చెలగాటమారడం బాధాకరమన్నారు.