చికెన్ ధరలపై వివాదం..వ్యక్తిపై దాడి..

– ఓ షాప్ కార్మికుడిపై మరో షాప్ యజమాని దాడి..
– తీవ్రంగా గాయపరిచిన వైనం..
– విచారిస్తున్న పోలీసులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
చికెన్ మాంసం ధరలు పై రేగిన వివాదం దాడులకు దారితీసింది.దీంతో ఓ షాపులో పని చేస్తున్న కార్మికుడు పై మరో షాపు యజమాని, అతని మనుషులు దాడికి పాల్పడ్డారు. ఇందులో కార్మికుడికి తీవ్రగాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందించారు. బాధితుడు గోళ్ళ శ్రీనివాసరావు పిర్యాదు మేరకు ఏ.ఎస్.ఐ రెహ్మాన్ తెలిపిన వివరాలు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని బూర్గంపాడు రోడ్ లో గల  షౌకత్ అనే యాజమాని షాపులో గోళ్ళ శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. రోజు వారీ పనిలో భాగంగా తాను పనిలో నిమగ్నం అయి ఉండగా ఉదయం 9.50 సమయంలో పక్కనే ఉన్న షాపు యజమాని దూబచర్ల హేమంత్,ఆకుల శేఖర్ లు వచ్చి తన పై దాడి చేసారు.ఈ దాడిలో గోళ్ళ శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు.విస్తారంగా రక్తస్రావం కావడంతో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకుని పిర్యాదు చేసాడు.చికెన్ షాపు ల యజమానులు సిండికేట్ అయి మార్కెట్ ధరలు కంటే అదనంగా మాంసం విక్రయిస్తుండ గా తన యజమాని షౌకత్ సిండికేట్ లో లేకుండా మార్కెట్ ధరకే  తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.ఇదే నా పై దాడికి కారణం అని ఫిర్యాదులో తెలిపాడు.పర్యాదు అందిన దృష్ట్యా విచారిస్తున్నాం అని ఏఎస్ఐ రెహ్మాన్ తెలిపారు.