పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తూ, భారత సమాఖ్య స్ఫూర్తికి సమాధి కట్టే వివాదాస్పద జమిలి ఎన్నికల కోసం బీజేపీ ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్‌లో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రతిపాదించింది. ఈ బిల్లులను ప్రవేశ పెట్టాలా? లేదా అన్న విషయమై ఓటింగ్ జరిగినప్పుడు మొత్తం 461 మంది సభలో ఉన్నారు. అందులో 269 మంది అధికార పక్షానికి అనుకూలంగా, 198 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అప్పుడు సభలో ఉన్న వారి సంఖ్యాబలాన్ని బట్టి చూసినా ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ల బిల్లును ఆమోదింప చేసు కోవడానికి రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు ఎన్డీయే సర్కారుకు లేదని స్పష్టమైంది. ప్రజెం టేషన్ దశలోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఈ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపిస్తామని కేంద్ర ప్రభుత్వం సభకు హామీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
జమిలి ఎన్నికల వల్ల వ్యయం భారీగా తగ్గి ప్రభుత్వ ఖజానాకు లబ్ది చేకూరుతుందనేది మోడీ సర్కార్ వాదన. కానీ అసలు కుట్ర వేరే ఉంది. వీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘ఒంటెత్తు పోకడే’! ‘ఒకే దేశం – ఒకే విధానం’ అంటూ దేశాన్ని క్రమక్రమంగా కేంద్రీకృతం వైపు లాక్కెళ్లుతున్న సంగతి తెలిసిందే. భౌగోళికంగానూ, ప్రజల జీవన విధానంలోనూ అడుగడుగునా భిన్నత్వంతో తొణికిసలాడుతూ ఏకత్వాన్నిచాటే దేశం మనది. సంఫ్‌ు పరి వార్‌కు మొదటి నుంచి కంటగింపు కలిగి స్తున్నదీ ఇదే. అందుకనే దేశంలో ఈ భిన్నత్వ వైశిష్టాన్ని దెబ్బతీసే కుట్రలు సాగుతున్నాయి. సువిశాల భూభాగంలో 140కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో ప్రతి విషయంలోనూ ఒకే విధానాన్ని అనుసరిస్తూ పోతే అది ప్రభుత్వ పాలనాధికారాలు కేంద్రీ కృతం కావడానికి దోహదం చేస్తుందే తప్ప, రాష్ట్రాల పురోగతికి కానీ, ప్రజల సంక్షేమానికి కానీ అది ఏ కోశానా తోడ్పడదు.
ప్రస్తుతం మనం అనుసరిస్తున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అధ్యక్ష తరహా పాలన దిశగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం. మూడు నాలుగు రాష్ట్రాలలో కూడా ఒకే విడత ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల కమిషన్‌కు తలకుమించిన భారం అయిపోతోంది. ఒకే రాష్ట్రంలో సైతం మూడునాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు అనేకం. అలాంటిది దేశమంతా ఒకేసారి ఎన్నికలు ఎలా సాధ్యం? ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు అంతిమంగా గట్టెక్కుతాయో లేదా అన్న విషయం పక్కన పెడితే.. బిల్లు ప్రతిపాదన దశలోనే ప్రతి పక్షాలు చాలా తీవ్రంగా ప్రతి ఘటిం చాయి. ఇండియా కూటమిలోని అన్ని పక్షాలు ముక్త కంఠంతో బిల్లు ప్రతి పాదనను అడ్డుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డాయి. ఒకే దేశం- ఒకే ఎన్నికల ప్రతిపాదనను బేరీజు వేయ డానికి మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికలోనే అనేక లోపాలున్నాయి. ఈ కమిటీ ఏడు దేశాలలో పరిస్థితిని అంచనా వేసినట్టు చెబుతున్నది. కానీ వాటిలో ఒక్క దేశం విస్తీర్ణం మన దేశంలోని ఏ రాష్ట్రం కన్నా పెద్దది కానే కాదు. పదిహేడు వందల పేజీలకు పైగా ఉన్న కోవింద్ కమిటీ నివేది కను ఆరు నెలల్లో తయారు చేశారనడం ఒట్టి ‘జుమ్లా’. ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్న దస్త్రాలకు ఈ కమిటీతో ఆమోదముద్ర వేయించారని పిస్తోంది.
ఒకే భాష, ఒకే కట్టూబొట్టు, ఒకే తిండి, ఒకే విద్య… ఇలా దేశమంతా ఒకే విధానం ఉండాలని సంఫ్‌ు పరివార్ పేరాశ. ఈ కోవలో జమిలి ఎన్నికలు కూడా రుద్దాలనే దాని ఉబలాటం. ప్రజల సంపదను లూటీ చేసి కార్పొరేట్ కంపెనీలు కుమ్మరిస్తున్న కోట్లాది రూపాయల సొమ్ముతో ‘ఆపరేషన్ కమల్’ చేపట్టి, రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చివేస్తూ ఇప్పటికే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తోంది. ఇక దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే అది పార్లమెంటరీ వ్యవస్థకు పెను విఘా తంగా మారుతుంది. సమాఖ్య స్ఫూర్తినే ప్రమాదంలోకి నెట్టే స్తుంది. జమిలి ఎన్నికలు జరపాలంటే దేశంలోని అన్ని శాసన సభలనూ ఒకేసారి రద్దు చేయాలి. లేదా కొన్ని శాసనసభలను ముందస్తు ఎన్నికలకు ఒప్పించాలి. మరికొన్నింటికి పదవీకాలం పొడి గించాలి. ఇంత కసరత్తు చేస్తే తప్ప ‘జమిలి’ సాధ్యపడదు.
భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్దేశిస్తోంది. ఒకవేళ బీజేపీ కోరుకున్నట్టు జమిలి జరిగితే రాష్ట్రాల ఉనికికే ప్రమాదం వాటిల్లుతుంది. దేశవ్యాప్త ప్రచారాల్లో ప్రాంతాలవారీ సమస్యలు కొట్టుకుపోతాయి. ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోయి…కనుమరుగయ్యే ప్రమా దముంది. సరిహద్దు ఘర్షణలనో, మైనార్టీలనో బూచిగా చూపెట్టి ప్రజలను మతాల పరంగా, ప్రాంతాల పరంగా చీలి కలు పేలికలు చేసి ప్రజా సమస్యలను తొక్కిపెట్టేస్తారు. మణి పూర్ మారణహోమం, అదానీ వ్యవహారం, రూపాయి అంత కంతకూ దిగజారిపోవడం, వడ్డీరేట్లు, ధరాఘాతం, రైతుల నిర సనలు, నిరుద్యోగం మరింతగా పెరగడం, వాటిని పరిష్కరించే చేవలేకనే బీజేపీ నేడు ఆడుతున్న నాటకాలివి. ఇవి దేశానికే కాదు, ప్రజలకు, ప్రజా ప్రయోజనాలకు అత్యంత ప్రమాదకరం.