న్యూరో సర్జన్ డాక్టర్ తిరుమల్ కు విశిష్ట ఆహ్వానం

నవతెలంగాణ – దుబ్బాక
ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వై.తిరుమల్ కు విశిష్ట ఆహ్వానం అందింది.దుబ్బాక మున్సిపల్ పరిధి లచ్చపేట పదో వార్డుకు చెందిన ప్రముఖ కవయిత్రి ఎర్రగుంట సుజాత మాజీ ఎంపీటీసీ ప్రసాద్ దంపతుల కుమారుడు వై.తిరుమల్ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో అదనపు న్యూరో సర్జన్ గా పనిచేస్తున్నారు. ఈనెల ఫిబ్రవరి 13 నుండి 17 వరకు శ్రీలంక లోని కొలంబోలో, మే 11 నుండి 14 వరకు లండన్ లో నిర్వహించే “పీడియాట్రిక్ న్యూరో సర్జరీ” సమావేశాల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.అరుదైన గౌరవం దక్కడం పట్ల తల్లిదండ్రులు సుజాత ప్రసాద్,లచ్చపేట వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.