ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

నవతెలంగాణ – కంటేశ్వర్

నిజామాబాద్ నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో సప్లమెంటరీ పరీక్షలలో ఫెయిల్ అయినందుకు మనస్థాపానికి గురైన విద్యార్థి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ కుమార్ శనివారం తెలిపారు. ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని చంద్ర నగర్ కు చెందిన బచ్చు సంతోష్ కుమారుడు బచ్చు సూయంత్ 17 సంవత్సరాలు ఇంటర్ మొదటి సంవత్సరం ఓ ప్రైవేట్ కళాశాలలో చదవగా ఇంటర్ మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయినందుకు సప్లమెంటరీ పరీక్షలు రాయగా అందులో కూడా అతను ఫీల్ అయినందున తేదీ 7 జూలై 2023 న వచ్చిన ఫలితాలలో రిజల్టు  రావడంతో , అది మనసులో పెట్టుకొని తన తల్లి స్రవంతి ఆరోగ్యం బాగాలేనందున తన తన తమ్ముడిని తీసుకొని తన తల్లి స్రవంతి ఆస్పత్రికి వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో హాల్లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయాడని తండ్రి బచ్చు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు.