ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పసునూరి సిసిర 5వ జన్మదిన సందర్భంగా వారి సహకారంతో శనివారం రాత్రి 10 గంటలకు భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ నుండి ఎస్ ఎల్ ఎన్ ఎస్ డిగ్రీ కళాశాల వరకు బస్టాండ్, రైల్వే స్టేషన్ మరియు వివిధ ప్రాంతాలలో రోడ్డుపై పడుకునే పేద ప్రజలకు దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ పట్టణ శాఖ చైర్మన్ వెల్లంకి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వికలాంగులకు, నిరాశరాయులకు వృద్ధులకు తమ వంతు సహాయ సహకారాలు అందించి సేవా గుణం కలిగి ఉండాలని కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తోడ్పాటు అందిస్తుందని వారు తెలియజేశారు. సిపిఆర్ అవగాహన సదస్సులు ,రక్తదాన శిబిరం మరియు ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదలకు అన్ని విధాల సహాయా సహకారాలు అందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని సొసైటీకి వెన్ను తేవాలని కోరారు. ఈరోజు పేదలకు దుప్పట్లు అందిస్తున్న పసునూరి లింగారెడ్డి కీ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సి చంద్రశేఖర్, తాళ్లపల్లి చంద్రశేఖర్, వి భాస్కర్ రెడ్డి, నర్సింగ్ రావు ,మల్లి, సుజావుద్దీన్ పాల్గొన్నారు.