100 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం ..14 క్వింటాళ్ల గుడాల పంపిణీ

నవతెలంగాణ ఆర్మూర్: పట్టణంలోని చిన్న బజార్ లో గల లక్ష్మీనారాయణ మందిరంలో క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు హజారి మదన్ మోహన్, బారడ్ గంగా మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం క్షత్రియ కుటుంబాలకు 14 క్వింటాళ్ల గుడాలు (అనుములు) పంపిణీ చేశారు. హోలీ పండుగను పురస్కరించుకొని గత 100 సంవత్సరాల నుంచి క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో గూడాలు (అనుములు) పంపిణీ చేస్తారు. ఈ ఆచారం అనేక ఏళ్ల నుంచి వస్తున్నందున ఆర్మూర్, పెర్కిట్ లలో నివసించే క్షత్రియ కుటుంబాల వారికి పంపిణీ చేస్తారు. ప్రతి క్షత్రియ కుటుంబ సభ్యుడు తమ హక్కుగా భావించి లక్ష్మీనారాయణ మందిరం వద్దకు వచ్చి వరుస క్రమంలో నిలబడి పేర్లు వ్రాయించి గూడాలను తీసుకెళ్తారు. ఈసారి నిర్మల్ జిల్లా పెంబి నుంచి 14 క్వింటాళ్ల గుడాలను తీసుకొచ్చారు. రాత్రి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉడికించి క్షత్రియ కుటుంబాల వారికి పంపిణీ చేశారు. గుడాల పంపిణీ కార్యక్రమ కన్వీనర్ డీకే శ్రీహరి పర్యవేక్షణలో ప్రశాంతంగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ కోశాధికారి వైద్య సంజయ్, ఉపాధ్యక్షులు రెడ్డి ప్రకాష్, గటడి కిషన్, డీకే శ్రీనివాస్, జెస్సు ఆనంద్, బాదం రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు బాదం రాజేందర్, హజారి రమేష్, షికారి శ్రీనివాస్, భారడ్ కిషోర్, సంతని విజయ్, సర్వ సమాజ్ ఉపాధ్యక్షుడు వైద్య రవీందర్, ప్రధాన కార్యదర్శి కర్తన్ దినేష్, సభ్యులు పోహార్ రాజ్ కరణ్, అల్జాపూర్ హరికి ఆనంద్, జెస్సు శ్రీనివాస్, దొండి శ్రీనివాస్, మామిడి లక్ష్మీనారాయణ, చౌల్ రాజ్ కుమార్, సాత్ పుతే శ్రీనివాస్, బోబిడే గంగా కిషన్, కర్తన్ శ్రీనివాస్, దొండి శ్యామ్, జుగ్గే సుధీర్, ఘటడి రాజు, పోహార్ విఠోబా శేఖర్, కర్తన్ రవి, కాటేగర్ శ్రీనివాస్, ఘటడి రాజేష్, గట్టడి పతి గంగా మోహన్, పోహార్ గంగా మోహన్, చౌల్ ధర్మపాల్, మాణిక్ ప్రవీణ్, దొండి ఈశ్వర్, కోలు చంద్రశేఖర్, షికారి రాజు, ఖాందేష్ సత్యం, దొండి శ్రీనివాస్, హజారీ సతీష్, పోహార్ నవీన్, అల్జాపూర్ వీరేంద్ర, దొండి సుఖేష్ వర్మ, సాత్ పుతే గణేష్ గౌరవ్, బారడ్ బాలాజీ రావు, ఎస్ జి రాము, కర్తన్ నవీన్, బారడ్ రమేష్, జీవి గౌతమ్, యువజన సమాజ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు జీవి ప్రశాంత్, విశ్వనాథ్ శ్రీను రాజేష్ తదితరులు పాల్గొన్నారు.