రెంజల్ మండలం నీలా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు నేలపై కూర్చుండి విద్యను అభ్యసిస్తుండగా, ఈ విషయం తెలిసిన వసంత టూల్స్ అధినేత దయానంద్ రెడ్డి తన బాల్య మిత్రుడు నాగేశ్వరరావు సహకారంతో పాఠశాలకు 15 డ్యూయల్ డెస్క్ లను అందజేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామ్ పేర్కొన్నారు. తమ పాఠశాల విద్యార్థులకు సహాయ సహకారాలను అందించిన దయానంద రెడ్డి, నాగేశ్వరరావు, జలంధర్ గౌడ్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి కట్టా ఆంజనేయులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఈ శంకర్, పిఆర్టియు మండల అధ్యక్ష కార్యదర్శులు టి సోమలింగం గౌడ్, కిషోర్, ఉపాధ్యాయులు ఆనంద్, లింగన్న, యూత్ అధ్యక్షులు సద్దాం, సుధాకర్, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు.