నవతెలంగాణ-చాంద్రయాన్‌గుట్ట
రాజన్నబావి ఫలుక్‌నామా సమీపంలోని రెయిన్‌బో హౌమ్‌లోని అనాథ బాలికలకు బీఆర్‌ఎస్ నాయకులు ఎస్.పి.క్రాంతి కుమార్, ఎస్.శైలజ దంపతులు ఆదివారం గాలిపటాలు, నువ్వుల లడ్డులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్రాంతి అందరి జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అనాధ బాలికలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్.ప్రణీత్, రితేష్ శ్రీవాస్తవ్, రెయిన్‌బో హౌమ్ సిబ్బంది పాల్గొన్నారు.