నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని పెర్కవేడు గ్రామంలో జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ఆధ్వర్యంలో గురువారం 10వ తరగతి విద్యార్థులకు ఆల్ఇన్ వన్ బుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్, ప్రధానోపాధ్యాయుడు సుజన్ తేజ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టాంగా చదివి అధిక ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. పాఠశాలకు, గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. నోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నాల తారశ్రీ రాజబాబు, ఎంపీటీసీ బండి అనూష రాజబాబు, ఎస్ఎంసి చైర్మన్ పరిధుల సుధాకర్, ఉపాధ్యాయులు ప్రమోద్, వేంకటేశ్వర్లు, గోపిరాన్, రాధా. రమేష్, సమ్మయ్య, మహేశ్వర్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.