ప్రాథమిక పాఠశాలకు ఆండ్రాయిడ్ టెలివిజన్ సెట్ వితరణ..

Distribution of android television set to primary school.నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన కమ్మర్ పల్లి సింగిల్ విండో చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ఆండ్రాయిడ్ టెలివిజన్ సెట్ ను  వితరణ చేశారు. ఈ మేరకు దేవేందర్ తన తండ్రి స్వర్గీయ రేగుంట రాజన్న జ్ఞాపకార్థం ఈ ఆండ్రాయిడ్ టెలివిజన్ సెట్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందజేశారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం  డిజిటల్ తరగతుల బోధన కొరకు ఆండ్రాయిడ్ టెలివిజన్  సెట్ ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గిరిధర్ మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులకు సహకారం అందించడం అభినందనీయమన్నారు. పాఠశాల విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం పాఠశాలకు చేయూతను అందించిన దేవేందర్ ను  ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సోమ దశరథ్, సభ్యులు అశోక్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయులు సల్లూరి కిషన్ గౌడ్, సిరిమల్ల దేవన్న, రంగాచారి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ గౌడ్, సుమలత ,శిరీష, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.