– సహకారం అందించిన బుసిరెడ్డి పౌండేషన్
నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం,పెద్దబావి తండా ఆంజనేయ స్వాములకు బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సమ్మాన్ కార్యక్రమంలో భాగంగా స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని పాండురంగారెడ్డి నిర్వహించారు. ఈసందర్బంగా అన్నదాత సుఖీభవ అంటూ స్వాములు అందరూ బుసిరెడ్డి పాండురంగారెడ్డి కుటుంబాన్ని సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వుండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ఛత్రు నాయక్ స్వామి, రమేష్ స్వామి, నరేష్ స్వామి, నవీన్ స్వామి, కుమార్ స్వామి,సైదా స్వామి,సాయి స్వామి, శ్రీను స్వామి, సునీల్ స్వామి, రాజేష్ స్వామి, అంజి స్వామి, జగన్ స్వామి, నాగేశ్వరరావు స్వామి, భక్తులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.