
మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో పశువులకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం మండల పశువైద్యులు డా. కిరణ్ దేశ్ పాండే, డా. ఉమామ సెహర్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. రైతులు తమ పశువులకు నట్టల నివారణ మందులను వేయించాలని తెలిపారు. కొత్త గడ్డి తినడం వల్ల, కుంటల్లో నిలువ ఉన్న నీటిని త్రాగడం వల్ల పశువుల దొబ్బకు నట్టలు చేరుతాయని దాని నుంచి రక్షించడం కోసం ముందు జాగ్రత్తగా నట్టాల నివారణ మందులను వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దారం ప్రవీణ్, పశువైద్య సిబ్బంది విఎల్ఓ టి. వినీత, జేవిఓ గంగజమున, విఏ పాషా, ఆఫీస్ సబార్డినేట్స్ శ్రీనివాస్, సజ్జత్, గోపాల మిత్రులు బేగ్, దిలీప్ పాల్గొన్నారు.