విపంచి ఫౌండేషన్ ఆద్వర్యంలో అట్లాసు పుస్తకాల పంపిణీ

  • పేద విద్యార్ధుల అభ్యున్నతి కోసమే విపంచి ఫౌండేషన్
  • అనుముల శ్రీనివాస్ , విపంచి ఫౌండేషన్ ఛైర్మన్
    నవతెలంగాణ రామన్నపేట: మండలం లోని ఇంద్రపాల నగరం లోని జిల్లా పరిషత్ పాఠశాలలో వెలకుర్తి పుల్లయ్య చారి – కనకమ్మ దంపతులు వెలకుర్తి నారాయణ చారి –వెలకుర్తి పరుషయ్య చారి అనుముల అంతయ్యల జ్ఞాపకార్ధం వారి కుమారులు వెలకూర్తి కుమార చారి, నర్సింహా చారి, సువర్ణా చారి చంద్రశేఖర చారి, అనుముల శ్రీనివాస్ లు సంయుక్తంగా పదవ తరగతి చదివే విద్యార్ధులకు రాయల్ అట్లాసు పుస్తకాలను అందచేశారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు భవిష్యత్తు నిర్మాణం కోసం దాతల సహకారం తీసుకోవాలని, అదే విదంగా విపంచి ఫౌండేషన్ ఎల్లప్పుడు సహకారం అందిస్తుందని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిదంగా హెడ్మాస్టర్ కోటగిరి శేఖర్ సభాద్యక్షత వహించి మాట్లాడుతూ విపంచి ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సహకరించడం అభినందనీయమని భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెలకుర్తి కుటుంబ సభ్యులు కుమారా చారి, నర్సింహా చారి, చంద్రశేఖరా చారి ఉపాద్యాయులు పుట్ట సైదులు, శ్రీనివాస్ రెడ్డి, వేణు, అశోక్, ఆల్వాల్ రెడ్డి నిర్మల, లింగాచారి పెంటయ్య, లక్ష్మి ప్రసన్న గీత, మణి, ఫౌండేషన్ కొ అర్డినేటర్ బూరుగు గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.