విద్యార్ధులకు బ్యాగ్స్‌, డ్రాయింగ్‌ కిట్స్‌ పంపిణీ

నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని మోత్కూర్‌ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్ధులకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ద్వారా పాఠశాలలో ఉన్న 150 మంది విద్యార్ధులకు బ్యాగ్స్‌, డ్రాయింగ్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్‌ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ మారుమూల పాఠశాలకు ఇన్ఫోసిస్‌ బాగ్స్‌ ఇవ్వడం సంతోషకారం అన్నారు. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సుధామూర్తికి, సంస్థ ఉద్యోగులు ముత్యపు వంశీలతో పాటు ఇందుకు కృషి చేసిన గ్రామ యువకులు కరణం శ్రీకాంత్‌రావ్‌, కరణం క్రిష్ణకాంత్‌కి గ్రామస్తులు, పాఠశాల యాజమాన్య కమిటి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జైరాం, వైస్‌ ఎంపీపీ గుర్మిట్కాల మల్లేశం, కరణం శ్రీకాంత్‌, సంపల్లి మల్లేషం, సంకటి శశిధర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చాకలి నందయ్య, పొరళ్ల ఆనంతయ్య, గొల్ల గోపాల కృష్ణ, జీడీ లింగయ్య, యాదయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.