తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు బ్యాగుల పంపిణీ..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో సోమవారం తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉచితంగా బ్యాగులను పంపిణి చేశారు. గన్నారం పాఠశాలలో కీరి శేషులు తిరునగిరి వెంకట నారయణ జ్ఞాపకార్థం వారి కుమారుడు తిరున గిరి సప్తగిరి, కోడలు తిరున గిరి స్వాతి, కూతురు మధురకవి కవిత, ఏ వాసిని, మనస్వినిలు మనుమరాళ్ళతో కలిసి 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు 114 బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమనికి ముఖ్య అతిథిగా సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. తల్లిదండ్రుల జ్ఞాపకాలు నేమరేసుకుని ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి తమ తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా విద్యా నభ్యసించుకోవలని సూచించారు.ఈ కార్యక్రమం లో గన్నరం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు  వీరలక్ష్మి, పాఠశాల ప్రదానోపాధ్యాయులు ఎం. రవిందర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.