బతుకమ్మ చీరల పంపిణీ

-బతుకమ్మ చీరను మహిళకు అందజేస్తున్న వైస్ ఎంపీపీ లత, సర్పంచ్ సమ్మిరెడ్డి
నవతెలంగాణ-వీణవంక: మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతాశ్రీనివాస్, సర్పంచ్ ఎం సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ లతశ్రీనివాస్, సర్పంచ్ సమ్మిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళలకు చీరలను పంపిణీ చేయడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తన్నీరు హరీష్ రావు టీం రాష్ట్ర అధ్యక్షుడు అప్పని హరీష్, ఉప సర్పంచ్ దుడపాక రాజ కొండయ్య, వార్డు సభ్యులు ఎజ్జు మహేందర్, కుండే హరీష్, ఎజ్జు శ్రీధర్, యారా రాజవ్వ, సమ్మయ్య, యార కొమల కొమురయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.