బతుకమ్మ చీరల పంపిణీ

– బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న మునిసిపల్ చైర్మన్
నవతెలంగాణ జమ్మికుంట:
 సీఎం  కెసిఆర్ తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో  మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు శుక్రవారం ప్రారంభించి, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీపతి నరేష్, పొనగంటి సారంగం, బిట్ల కళావతి మోహన్  వార్డు ఆఫీసర్ స్వాతి  తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోత్కులగూడెం గ్రామంలో సింగిల్ విండో అధ్యక్షులు పొన్నగంటి సంపత్ బతుకమ్మ చీరలను శుక్రవారం స్థానిక రేషన్ షాప్ వద్ద మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి రాము , పొన్నగంటి శ్రీలత, బిట్ల కళావతి, పొన్నగంటి విజయలక్ష్మి, పొనగంటి సారంగం తదితరులు ఉన్నారు.