రోటరీ క్లబ్ భువనగిరి సెంట్రల్ ఆధ్వర్యంలో బెంచిల బహుకరణ..

– క్లబ్ అధ్యక్షులు పకీరు కొండల్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో రోటరీ క్లబ్  భువనగిరిసెంట్రల్  ఆధ్వర్యంలో మంగళవారం  ప్రాథమిక పాఠశాలలో బద్దం రంగారెడ్డి సౌజన్యంతో  రూ.60, 000 విలువ గల బెంచిలను  ప్రధానోపాధ్యాయురాలకు సబితకు అందజేసినట్లు క్లబ్ అధ్యక్షులు పకీరు కొండల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ గతంలో పాఠశాలకు అవసరమగు ఎన్నో వసతులు ఏర్పాటు చేయడం జరిగినదనీ,  సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు ముందున్నాయని అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్  విట్టల్ వెంకటేష్,  సల్ల పాండు , ఫకీరు యశ్వంత్ రెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.