విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

నవతెలంగాణ-అక్కన్నపేట
అక్కన్నపేట మండలం అంతకపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్‌ సహకారం.. 1985-86 ఎస్‌ఎస్‌ఎస్సి బ్యాచ్‌ సౌజన్యంతో 70 మంది బాలికలకు సైకిళ్లను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హన్మకొండ రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యా‌ర్థు‌ల‌ కోసం తమ క్లబ్‌ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ సంవత్సరం నాలుగు వందల మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. ఫర్నిచర్‌, రాత పుస్తకాలు, వాటర్‌ ప్లాంట్‌ లు ఏర్పాటు చేయడ ంతో పాటు చదువులో ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించామన్నారు. ఎస్‌ఎస్‌ సి బ్యాచ్‌ కన్వీనర్‌ జనగామ పాపారావు మాట్లా డుతూ సైకిళ్ల కయ్యే ఖర్చులో రోటరీ క్లబ్‌ 85% భరించగా విద్యార్థుల కంట్రియషన్‌ గా మిగతా 15 శాతాన్ని తాము అందించామన్నారు. సైకిళ్లను బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ఫాస్ట్‌ డిస్టిక్‌ గవర్నర్‌ కాయిత ఇంద్రసేనారెడ్డి, సర్పంచులు ఇర్రి లావణ్య రాజిరెడ్డి, ముత్యాల సంజీవరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు కంది రజిత, ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్‌, ఎంఈఓ నరసింహారెడ్డి, కరీంనగర్‌ జిల్లా అకాడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ అశోక్‌ రెడ్డి, రైల్వే ఇంజనీర్‌ పద్మనాభం, రైల్వే యూనియన్‌ నాయకులు యాదవ రెడ్డి, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు జయశ్రీ, శ్రీదేవి, ఉప సర్పంచ్‌ సమ్మయ్య, ఎస్‌ఎంసి చైర్మన్‌ కాశ బోయిన రజిత పాల్గొన్నారు.