రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ

నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి మండలంలోని వీరవల్లి గ్రామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థినిలకు రోటరీ క్లబ్ ఆఫ్ భువనగిరి సెంట్రల్ ఆధ్వర్యంలో  రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్, వెల్జాన్  వారి సహకారముతో సైకిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం పాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ..
వీరవల్లి నందు  విద్యనభ్యసిస్తున్న  (05) గురు బాలికల రవాణా సౌకర్యం కొరకు రూ.30,000 విలువ గల ఐదు సైకిలను డా. ఎంపల్ల బుచ్చిరెడ్డి చైర్మన్, మెంబర్షిప్ డెవలప్మెంట్ జోన్ 2, పకీర్ కొండల్ రెడ్డి  అధ్యక్షుల  చేతుల మీదుగా అందజేసినట్లు , భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు కొనసాగించనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి హనీఫ్ మెమన్ క్లబ్ కార్యదర్శి, మాజీ అధ్యక్షులు జిల్లాల కొండల్ రెడ్డి,  కోశాధికారి గుమ్ముల మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె సతీష్, ఉపాధ్యాయ బృందం, బాలికల తల్లిదండ్రులు  పాల్గొన్నారు.