
నవతెలంగాణ డిండి: మండలం ఖానాపూర్ గ్రామంలో ఆదివారం లయన్స్ క్లబ్ నల్గొండ ఆఫ్ స్టార్స్ వారు స్థానిక సర్పంచ్ తిప్పర్తి విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ నల్గొండ ఆఫ్ స్టోర్స్ ప్రెసిడెంట్ కొండా శ్రీనివాస్, ట్రెజరర్ లయన్ తుమ్ములూరు మురళీధర్ రెడ్డి, లయన్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ ప్రజలు తిప్పర్తి రాంరెడ్డి, బుచ్చిరెడ్డి, లచ్చయ్య, శ్రవణ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.