
నవతెలంగాణ -తాడ్వాయి
ములుగు జిల్లా లో గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ, ఖమ్మం వారు తాడ్వాయి మండలంలోని పగిడపురం, కౌశెట్టివాయి. నర్సాపూర్ పంబపూర్ పాత పంబపుర్, కాటాపూర్ దామరవాయి, కొత్తూరు మోట్ల గూడెం, బొంబాయిగూడెం, శ్రీరామ్ నగర్ గ్రామాలలోనీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరు పేద విద్యార్ధిని విద్యార్థులకు, దుప్పట్లు, జంతికలు, పేస్ట్ లు, బ్రష్ లు, సబ్బులు, పెన్నులు, తినుబండారాలు, గిఫ్ట్ ప్యాకెట్స్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ఏటూరు నాగారం ఇంచార్జ్ కంతి ముత్తయ్య, ముర్రం రాజేష్, కంతి లక్ష్మణ రావు, పోరిసెట్టి అది శివ, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.