నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని రావిరాల గ్రామంలోని వరద బాధిత 150 కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ చేసినట్లు విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ ఎన్ ఎఫ్ హెచ్ సి ఫౌండేషన్ సెక్రటరీ రమేష్ తెలిపారు.విజ్ఞాన దర్శిని, నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్, శ్రీ స్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ 3 స్వచ్చంద సంస్థలు సంయుక్తంగా 150 కుటుంబాలకు దుప్పట్లు మరియు బట్టలు నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు ఎంపీడీవో బాలరాజు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింగారెడ్డి చేతుల మీదుగా శనివారం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రావిలాల గ్రామంలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షలకు చెరువు నిండి మత్తడి పోసి వరదలు గ్రామంలోకి రావడంతో వరదల వల్ల ఇల్లు కోల్పోయిన వారు మరియు వరదల వాళ్ళ ఇంట్లో సామాగ్రి పూర్తిగా కోల్పోయిన వారిని గుర్తించి వారి విషయాలను తెల్సుకొని, దేశ సేవలో భాగం అవుతున్న మూడు స్వచ్చంద సంస్థలు విజ్ఞాన దర్శిని, ఎన్ ఎఫ్ హెచ్ సి, శ్రీ స్వామి నాయక్ మెమోరియల్ సొసైటీల సంయుక్తంగా 150 కుటుంబాలకు దుప్పట్లు,మరియు బట్టలు ఉచితంగా పంపిణి చేసారు. స్వచ్చంద సంస్థలు సభ్యులు పూర్తిగా గ్రామంలోని వాడా వాడా తిరిగి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో తమ వంతు సహకారం ఈ గ్రామానికి ఉంటుందని అన్నారు. ఈ గ్రామంలోని వరద బాధితులకు సహకారం అందించిన విజ్ఞాన దర్శిని-ఫౌండర్ రమేష్, ఎన్ ఎఫ్ హెచ్ సి- మోహన్ శాస్త్రవేత్త , శ్రీ స్వామి నాయక్ మెమోరియల్ సొసైటీ – శశికళ బ్యాంకు మేనేజర్ స్వచ్చంద సంస్థ సభ్యులు దాతల వారి ఆర్ధిక సహకారంతో దుప్పట్లు మరియు బట్టలు పంపిణి చేసినందుకు వీరిని అభినందించినట్లు తెలిపారు. రావిలాల గ్రామలోని నష్టపోయిన విద్యార్థులకు త్వరలో చదుకునేందుకు బుక్స్ బ్యాగ్స్, అందిస్తామని, తెలియజేసారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి అరుణ రమేష్, రవి, అశోక్, గ్రామ పెద్దలు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.