కొండ రెడ్డి కుటుంబాలకి దుప్పట్లు వితరణ

నవతెలంగాణ – అశ్వారావుపేట :
మండల పరిధిలోని తిరుమలకుంట పంచాయితీ కొండ రెడ్డి గిరిజనులకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచన మేరకు నామా ముత్తయ్య మెమోరియల్  ట్రస్టు ఆద్వర్యంలో టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ బిర్రం వెంకటేశ్వరావు పర్యవేక్షణలో బుధవారం కొండ రెడ్డి కుటుంబాలకి దుప్పట్లు పంపిణీ చేశారు. నామా ముత్తయ్య మెమోరియల్  ట్రస్టు,ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సహకారంతో బిర్రం వెంకటేశ్వరావు మండలంలో అనేక గిరిజన గ్రామాల్లో దుప్పట్లు ను  పంచుతూ, మహిళలకు, వికలాంగులకు బట్టలు పంపిణీ చేస్తూ, హెల్త్  క్యాంప్ లు నిర్వహిస్తు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జుజ్జూరు రాంబాబు, బీఆర్ఎస్  మండల కార్యదర్శి జుజ్జూరి వెంకన్న, పార్టీ గ్రామ ప్రెసిడెంట్ చెన్నారావు, పానుగంటి లక్ష్మణరావు,జుజ్జురి సత్యనారాయణ పాల్గొన్నారు.