వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పురం రాజమౌళి బుధవారం నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చలి తీవ్రత దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణవాసులు, వృద్ధులు, తదితరులు పాల్గొన్నారు.