నవతెలంగాణ – మోర్తాడ్
మండల కేంద్రంలోని నిరుపేదలకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలను గుర్తించి వారికి ఆర్థిక సాయం అందించాలని ఉద్దేశంతో చలికాలం సందర్భంగా దుప్పట్లను పంపిణీ చేయడం జరుగుతుందని అధ్యక్షులు మనోహర్ తెలిపారు. లైన్స్ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందడమే తమ ఉద్దేశమని, తమకు దుప్పట్లు పంపిణీ చేసిన లైన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ సంజీవ్, మోహన్, జక్కం నాగరాజు, తీగల రమేష్, తదితరులు పాల్గొన్నారు