లయన్స్ క్లబ్ అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో లయన్ శీమకుర్తి చక్రధర్ రావు ఆర్థిక సహాయంతో స్థానిక పేట మాలపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు,పెన్నులు, పెన్సిల్స్,కంపాస్ బాక్సులు మరియు పాఠశాలకు ఉపయోగపడే కుర్చీలు అందచేసారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దూబగుంట్ల దుర్గారావు,యు ఎస్ ప్రకాష్ రావు, శీమకుర్తి వెంకటేశ్వరావు,సుంకవల్లి వీరభద్రరావు,కోటగిరి మోహన రావు,జూపల్లి బ్రహ్మా రావు కంచర్ల రమేష్,వి.ఎస్ ప్రకాష్ రావు,కంచర్ల రామారావు,చల్లా రామారావు, కోారు చలపతిరావు ఇనుగంటి ప్రవీణ్ కుమార్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.