బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ 

నవతెలంగాణ –  కామారెడ్డి 

బి.యన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా గ్రంథాలయనికి పుస్తకాలను వితరణ చేస్తున్నట్లు ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిఎన్, రావు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ జిల్లాలలో ఎక్కువగా నిరుద్యోగులు వివిధ పరీక్ష పోటీలకు సిద్ధమవ్వడానికి గ్రంథాలయాలలో చదువుకోవడానికి వస్తున్న జిల్లాలను గుర్తించి ఆ గ్రంథాలయాలకు తెలుగులో మూడు సెట్లు, ఇంగ్లీష్లో ఒక సెట్టు మొత్తం నాలుగు సెట్లను వితరణ చేయడం జరుగుతుందని, ఆ జిల్లాల గ్రంధాలయాలను రంధ్రాలకు వస్తున్న నిరుద్యోగులను బట్టి పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.