డాక్టర్ బి.ఎన్ రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాల వితరణ 

Distribution of books under the auspices of Dr. BN Rao Health Foundationనవతెలంగాణ – కామారెడ్డి
డాక్టర్ బి.ఎన్.రావు హెల్త్ ఫౌండేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి 25,000/- విలువలు గల పోటీ పరీక్షల పుస్తకాలను  వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఎన్.రావు ఫౌండేషన్ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ బి ఎన రావు, అడ్వకేడ్ జగన్నాథ్ , కౌన్సిలర్ అనూష,జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.  ఈ సందర్భంగా డాక్టర్ బి.ఎన్ రావు మాట్లాడుతూ వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే  అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను ఫౌండేషన్  ద్వారా గ్రంథాలయాలకు, బిసి,ఎస్సీ స్టడీ సర్కిల్ వారికి పుస్తకాలను  అందజేయడం జరిగిందన్నారు. గ్రంథాలయంలో గ్రూప్ 1 పీలిమ్స్ ఉత్తీర్ణత  సాధించిన అభ్యర్థులకు వారి ఫౌండేషన్ ద్వారా పుస్తకాలను ఉచితంగా అందజేస్తామన్నారు.