నవతెలంగాణ – ఆర్మూర్
రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మండలంలోని అంకాపూర్ లోని లాలన వృద్ధాశ్రమంలో వృద్దులకు ఆదివారం అల్పాహారం లో భాగంగా వారికి సమోసా ,బిస్కెట్స్, పండ్లు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్వారి గోపి కృష్ణ మాట్లాడుతూ మా వంతు సేవలు ఆశ్రమాలకు ఎల్లప్పుడూ ఉంటాయని స్పాన్సర్ లక్ష్మీనారాయణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారీ తులసి, రోటరీ మాజీ అధ్యక్షులు పుష్పకర్ రావు, ప్రవీణ్ పవార్, చౌటి లింబాద్రి, ఆశ్రమ సిబ్బంది సత్యం, తదితరులు పాల్గొన్నారు.