వికలాంగులకు 50 శాతం రాయితీపై బస్సు పాసు పంపిణీ

నవతెలంగాణ-జక్రాన్ పల్లి

మండలంలోని అర్హులైన వికలాంగులందరికీ 50 శాతం రాయితీపై బస్సు పాసులు అందజేసినట్లు రవీందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మండలంలోని ఐకెపి కార్యాలయంలో జక్రం పెళ్లి గ్రామానికి చెందిన తాళ్ల గంగాధర్ కు వికలాంగుల బస్సు పాసు 50 శాతం రాయితీపై ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులో రాష్ట్ర మంతట ప్రయాణించేటందుకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వికలాంగుల సిసి శ్రీరామ్ మండలంలోని ఆరుగురు కమ్యూనిటీ కోఆర్డినేటర్లు మండల సమైక్య సిబ్బంది పాల్గొన్నారు.