దివ్యాంగులకు 50 శాతం రాయితీపై బస్ పాస్ లు పంపిణీ

– దివ్యాంగులకు 4000 పెన్షన్ 50% రాయితీపై బస్ పాసులు సర్పంచ్ సురేష్

నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని దివ్యాంగులకు 3016 రూపాయల నుండి 4016 రూపాయలకు పెంచుతూ ఆసరా పెన్షన్లు అందించడంతో పాటు దివ్యాంగులకు బస్సు రవాణా సౌకర్యం లో 50% రాయితీపై పాసులు అందించడం ప్రజా సంక్షేమానికి నిదర్శనమని గ్రామ సర్పంచ్ సురేష్ పేర్కొన్నారు. మద్నూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ సురేష్ అధ్యక్షతన బాన్సువాడ ఆర్టీసీ అధికారులు దివ్యాంగులకు 50% రాయితీపై బస్ పాసులను సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమానికి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ప్రజలకు ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ బస్ డిపో మేనేజర్ తో పాటు ఆర్టీసీ అధికారులు గ్రామ ఉపసర్పంచ్ విట్టల్ ఎంపిటిసిల కుటుంబ సభ్యులు దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.