హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కెనరా విద్యా జ్యోతి స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్‌లోని కెనరా బ్యాంక్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కాస్ట్స్ నేషనల్ కమిషన్ డైరెక్టర్ జి సునీల్ కుమార్ బాబు, తెలంగాణ ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ బిక్కి వెంకటయ్య, కెనరా బ్యాంక్ సర్కిల్ హెడ్ బి చంద్ర శేఖర్ పాల్గొన్నారు. ఈ కార్పొరేట్ సామాజిక సేవ (సిఎస్‌ఆర్) కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 1236 మంది ఎస్‌సి, ఎస్‌టి మెరిట్ విద్యార్థినీలకు రూ.49.44 లక్షలు స్కాలర్‌షిప్‌లను పంపణీ చేయనున్నట్లు ఆ బ్యాంక్ వెల్లడించింది.