మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాల తెలుగు మీడియంలో 1998 ..99 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు శనివారం సీసీ కెమెరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం శ్రీనివాస్ అందజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథి శ్రీ పి రఘునాథ్ మాట్లాడుతూ పాఠశాల పరిసరాల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కెమెరాలను అందజేసిన పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల నిర్వహించుకున్న మా పదవ తరగతి మిత్రుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనంలో మేమందరం క.లిసి పాఠశాలకు సీసీ కెమెరా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అన్నారు. విద్యార్థులు భద్రంగా ఉంచుకోవాలని, మంచి ఉన్నత చదువులు చదవాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం శ్రీనివాసు వితరణ ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.