రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మగ్గిడి పాఠశాలకు కుర్చీల వితరణ I

నవతెలంగాణ -ఆర్మూర్
మండలంలోని మగ్గిడి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాలకు కుర్చీల వితరణ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్వారి గోపి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు తమ వంతు సేవలు ఎల్లప్పుడు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిత మాట్లాడుతూ రోటరీ సేవలు ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ ,ప్రాజెక్టు చైర్మన్ స్పాన్సర్ కోట నరేష్, రోటరీ సభ్యులు శశిధర్ పాఠశాల ఉపాధ్యాయులు కిషన్, అనిల్, విద్యార్థులుతదితరులు పాల్గొన్నారు.