రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కుర్చీల వితరణ

నవతెలంగాణ- ఆర్మూర్ : పట్టణంలోని  రామ్ మందిర్ ప్రాథమిక  పాఠశాల లోని విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్  అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ  మంగళవారం కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పట్వారి గోపి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారీ తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ సభ్యులు గోనే దామోదర్, రాస  ఆనంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, కవిత, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.