లేబర్‌ కార్డుల చెక్కుల పంపిణీ

నవతెలంగాణ- ఆలేరురూరల్‌
మండల పరిధిలోని వివిధ గ్రామాల భవన నిర్మాణ కార్మికులకు పెయింటర్స్‌ కార్మికులకు చెక్కులను భారత రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల మారయ్య పెయింటర్స్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పంగ కిషన్‌ ఒక లక్ష 30 వేల రూపాయల సాధారణ మరణానికి 30 వేల 80 రూపాయలు ఆడపిల్ల పెళ్లి కానుకగా 12 మంది లబ్దిదారులకు గురువారం ఆలేరులో అందజేశారు ..ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ కి లేబర్‌ కార్డు పాలసీ ద్వారా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి , ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మొయిద్దీన్‌ ,జిల్లా లేబర్‌ ఆఫీసర్‌ కందుల నర్సింగరావు ,పంగ దశరథ ,సుంచు మహేందర్‌, రవి ,రాజేందర్‌ ,బాబు ,సదానందం, బిక్షపతి ,వినరు పాల్గొన్నారు.