నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామంలో ఇటీవల వరదల వల్ల ఇల్లు కోల్పోయిన వారికి ట్రైబల్ రిలీఫ్ ఫండ్ నుండి ఒకరికి 25000/- చెక్కులను గురువారం ఐటీడీఏ పీవో అంకిత్ అందించారు. కాగా రెడ్కో చైర్మన్ ఏరువా సతీష్ రెడ్డి, ములుగు జిల్లా గ్రంధాలయ చైర్మన్ పొరిక గోవింద నాయక్ లు కూడా పిఓ అంకిత్ తో పాటు కూలిపోయిన గృహాలను పరిశీలించి లబ్ధిదారులకు నేరుగా 25 వేల రూపాయల చెక్కులను అందించారు. వరద బాధితులను ప్రభుత్వం కచ్చితంగా ఆదుకుంటుందని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సమ్మయ్య తహసిల్దార్ అల్లం రాజకుమార్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.