
గాంధారి మండలంలోని చద్మల్ తండాకు చెందిన ప్రియాంకకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.60 వేల చెక్కు మంజూరు అయ్యింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి చెక్కును మంగళవారం ప్రియాంక ఇంటికి వెళ్లి ఆమెకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గైని సాయిలు, మాజీ ఉప సర్పంచ్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.