
బుధవారం రోజున మోపాల్ మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లతా కన్నిరామ్ మరియు జెడ్పిటిసి కమల నరేష్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే మరియు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మండలంలోని 12 మంది లబ్ధిదారులకు రెండు లక్షల 2,47,500 విలువగల చెక్కులను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఎంపీపీ, కన్నిరం జడ్పిటిసి నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రo ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పార్టీలకు అతీతంగా నిరుపేద అయిన ప్రతి కుటుంబానికి కూడా ఈ బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో అందజేయడం జరుగుతుందని, నిజామాబాద్ జిల్లాలోని అత్యధికంగా మన రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అత్యధికంగా ఇవ్వడం జరుగుతుందని ఇటువంటి ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి దొరకడం మనం చేసుకున్న అదృష్టం అని, ప్రతిసారి బాజిరెడ్డి గారు తమ అందరికీ చెప్తూ ఉంటాడని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైనా సరే పార్టీలకతీతంగా అందించాలని ముఖ్యంగా నిరుపేద ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని పదేపదే చెప్తుంటారని వారు తెలిపారు. అదేవిధంగా షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా పార్టీలు అనే భేదం లేకుండా, అర్హుడైన ప్రతి ఒక్కరికి అందించే గొప్ప మనసు మన ఎమ్మెల్యే ది అని అటువంటి ఎమ్మెల్యేను తిరిగి మూడోసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, మోపాల్ ఎంపిటిసి ముత్తన సర్పంచులు సాయి రెడ్డి, ప్రకాష్, సిద్ధార్థ, భరత్, తదితర టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.